బ్లాక్ హెడ్స్‌ తొలగించాలంటే.. తేనె రాసుకోవాలి..?

సోమవారం, 11 మార్చి 2019 (10:51 IST)
అందంగా ఉండాలని ఎవరికుండదు.. అందుకోసం ఎవరికి తెలిసిన ప్రయత్నాలు వారు చేస్తుంటారు. అయితే.. కొందరి ఆ ప్రయత్నాలు సెట్ అయినా.. మరికొందరికి సెట్ కావు.. అలాంటి వారికోసం ఈ చిట్కాలు. రాత్రికి రాత్రి అందం సొంతం చేసుకోవాలంటే.. సౌందర్య సమస్యలకు చికిత్స రాత్రివేళే మొదలు పెట్టాలి. ముఖం, శిరోజాల సమస్యలకు తేనెతో కూడిన చిట్కాలు పాటిస్తే చాలు..
 
స్పూన్ తేనె తీసుకుని అందులో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని రాత్రంత అలానే ఉంచుకోవాలి. మరునాడు ఉదయాన్నే చల్లని నీటితో ముఖానికి, మెడను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
 
చాలామందికి ముక్కు భాగంలో నల్లటి వలయాలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినను ఎలాంటి ఫలితం కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. స్పూన్ తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి మునివేళ్లతో బ్లాక్ ‌హెడ్స్ మీద అప్లై చేయాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు పోతాయి.
 
కొందరికైతే జుట్టు పొడవుగా ఉంటుంది. కానీ, జుట్టు చివర్ల చిట్లిపోయి ఉంటుంది. అలాంటివారు.. ఆలివ్ నూనెలో కొద్దిగా తేనె కలిపి జుట్టు కొసళ్లకు రాసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమంగా చేస్తుంటే.. వెంట్రుకలకు తేమ అంది జుట్టు చిట్లడం ఆగిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు