కరివేపాకు, కొబ్బరినూనెతో తయారు చేసే ప్యాక్ వేసుకుంటే తెలుపు జుట్టుకు చెక్ పెడుతుంది. కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే తేనెతో హెయిర్ మాస్క్.. జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఒక చెంచా తేనె, ఆముదం, చెంచా రమ్, ఒక స్పూన్ గుడ్డు పచ్చసొన, విటమిన్ ఎ, విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఒక గంటపాటు అలానే ఉంచి ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
ఇకపోతే.. ఒక కప్పు పాలలో ఓట్స్ మిక్స్ చేసి, తర్వాత దీన్ని తలకు పట్టించి, 20 నిమిషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇంకా ఆనియన్ మిక్సీలో వేసి మెత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్‌ను మిక్స్ చేసి కేశాలకు పట్టించాలి. వారంలో రెండు సార్లు రాత్రుత్లో ఈ మాస్క్‌ను వేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.