స్త్రీలు సాధారణంగా ఒత్తయిన జుట్టుకోసం నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారికి కలబంద ఎంతగానో పనిచేస్తుంది. ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణంగా జుట్టు మొదళ్ల నుండి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటాయి.
తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతివారం చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.