నిమ్మరసం, చక్కెరతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:28 IST)
శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా పసుపు, తేనె, కలబంద గుజ్జు కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. వంటసోడాలో కొద్దిగా ఆలివ్ నూనె, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
నిమ్మరసంలో కొద్దిగా చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోతాయి. తద్వారా ముఖం మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు