ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:07 IST)
పెరుగులో కొద్దిగా చక్కెర, నారింజ తొక్కల పొడి కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో తేనె, ఓట్స్ పొడి, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తద్వారా మెుటిమలు తొలగిపోతాయి. నిమ్మరసాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. గోరింటాకు పొడిలో కొద్దిగా బ్లాగ్ కాఫీ కలుపుకుని తలకు రాసుకోవాలి.  
 
20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. ఆలిన్ నూనెలో కొద్దిగా ఉప్పు, గంధపు నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు