అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:06 IST)
తలస్నానం చేసిన తరువాత అన్నం వార్చిన నీటిని వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకుంటే వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటాయి. అదే నీటిని ముఖానికి పట్టిస్తే తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకుపోవడమే కాకుండా ముఖంపై గల మొటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 
 
ఎండకు కమిలిన చర్మాన్ని తాజాగా మార్చాలంటే.. అన్నం వార్చిన నీటిని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం తాజాగా మారడమే కాకుండా.. కాంతివంతంగా తయారవుతుంది. 
 
అన్నం వార్చిన నీటిలోని విటమిన్స్, ఖనిజ లవణాలు చర్మానికి మంచి పోషణనిస్తాయి. కాబట్టి ముఖానికి ఈ నీటిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది. 
 
కమిలిన చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు చర్మం త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఈ నీటిని ముంజేతులకు పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ఎండకు కమిలిన చర్మం బాగుపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు