దాల్చిన చెక్కతో మొటిమలు మటాష్.. ఎలా?

గురువారం, 11 మే 2017 (11:56 IST)
దాల్చిన చెక్కతో మొటిమలు దూరమవుతాయి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా పాలు కలిపి.. దానికి చెంచా దాల్చిన చెక్కపొడి చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. 
 
అలాగే అరటిపండు తొక్కని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమానికి తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి కడిగేసుకుంటే మొటిమల సమస్య అదుపులోకి వస్తుంది. అరటిపండు తొక్కలో ల్యూటిన్‌ అనే ఎంజైము ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు సాయపడుతుంది
 
ఇంకా మొటిమలకు చెక్ పెట్టాలంటే.. తరచూ చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి గుజ్జులో కాసిన్ని పాలు, కాస్త సెనగపిండి కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు ఏర్పడే అవకాశాలు తగ్గిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి