గులాబీ పువ్వు, పాలతో.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌

శుక్రవారం, 9 ఆగస్టు 2019 (12:24 IST)
అందంగా ఉండడానికి రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌లు వాడుతుంటారు. కానీ ఈ క్రీములు, ఫేస్‌వాష్‌లు కొందరికి సెట్‌కావు. అలాంటప్పుడు గులాబీ పువ్వులు వాడితే మంచి ఫలితం లభిస్తుంది. మరి ఈ పువ్వులతో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
  
 
గులాబీ ఆకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలుపుకుని ఆవిరి పట్టాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై మురికి, జిడ్డు తొలగిపోయి మృదువుగా మారుతుంది. ముఖం పొడిబారకుండా ఉండాలంటే గులాబీ పువ్వులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా తేనె, పాలు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే ముఖానికి కావలసిన తేమ అందుతుంది. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. వీటిని ఉపయోగించడం వలన ఎలాంటి సమస్యలుండవు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు