తల్లి పాలతో చిన్నారులకు ఆరోగ్యం.. మంత్రి వెల్లంపల్లి

గురువారం, 1 ఆగస్టు 2019 (19:54 IST)
పుట్టిన ప్రతి చిన్నారికి  తల్లిపాలు ఇవ్వడం వల్ల చిన్నారులకు ఆరోగ్యం అని తల్లి పాలు అమృతంతో సమానమని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 
 
గురువారం విజయవాడలో ఇండియన్ అకాడమీ పిరియాడిక్ కృష్ణాజిల్లా వారి ఆధ్వర్యంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 
 
ఇండియన్ అకాడమీ పిరియాడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరూ అవగాహన పొందవచ్చునన్నారు.
 
అనంతరం బందరు రోడ్డు నుంచి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైద్యులు తదితరులు పాల్గొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు