పాదాలను ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంత మేలు

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:48 IST)
పాదాలను వర్షాకాలంలో ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంతమంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వర్షంలో తడిసిన ప్రతిసారీ యాంటీబ్యాక్టీరియల్ కలిపిన నీటిలో పాదాలను కాసేపు వుంచి కడిగేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. 
 
ఆలివ్‌ నూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌, రోజ్‌మేరీ నూనె, రోజ్‌ ఆయిల్‌ తీసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ పాదాలను మర్దన చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది.
 
బకెట్‌ నీళ్లలో మూడు చెంచాల తేనె, చెంచా హెర్బల్‌ షాంపూ, రెండు చెంచాల బాదం నూనె వేసి పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
 
మూడు చెంచాల గులాబీనీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌ కలిపి కాళ్లకు రాసుకోవాలి. గంటయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు