ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి..

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:15 IST)
తియ్యగా పుల్లగా ఉండే ద్రాక్షతో ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు సౌందర్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపును సంతరించుకునేలా చేస్తాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. చర్మం మిల మిలా మెరిసి పోవాలంటే వారానికోసారి ద్రాక్ష పండ్లతో ప్యాక్ వేసుకోవాలని బ్యూటీషన్లు చెప్తున్నారు.. 
 
ద్రాక్ష పండ్ల గుజ్జుకు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై చర్మం కాంతిమంతం అవుతుంది. పొడిచర్మం సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొనకు, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. కళ్ల చుట్టూ ముడతలు వస్తున్నప్పుడు ద్రాక్ష పండ్లతో వాటిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షను రెండు ముక్కలుగా చేసుకుని కంటి చుట్టూ కొన్ని క్షణాలు రాయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు తగ్గిపోతాయి.
 
ఐదు స్పూన్ల పెరుగుకి, మూడు స్పూన్ల ద్రాక్ష రసం, ఒక స్పూను నారింజ రసం కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు. ఇది వయసు పైబడిన ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి