పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (18:50 IST)
తాను పార్ట్ టైమ్ నటిని, పూర్తిస్థాయి రాజకీయ నేతను అను కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. గత 2014 నుండి 2024 వరకు మధ్య మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆమె మళ్లీ తన నటనపై దృష్టిసారించారు. `క్యూంకి సాస్‌పి కపి బహు ది: రీబూట్' అనే టీవీ సీరియల్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. 
 
నటనపైపు మళ్లీ రావడంపై ఆమె స్పందిస్తూ, తాను మొదట ఒక రాజకీయ నేతను. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో రాణిస్తున్నాను. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. అదేసమయంలో పార్ట్‌టైమ్ నటిని. పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుతూ ఇపుడు టీవీ సీరియల్స్‌లో నటిండం వల్ల తాను ఒత్తిడికి గురవుతున్నాననే వార్తల్లో నిజం లేదు. నటన నాకు కొత్తా కాదు. కానీ, రాజకీయాలపై పూర్తిగా దృష్టిసారించడం వల్ల నటనకు కాస్త దూరంగా ఉన్నాను. 
 
టీవీ పరిశ్రమ నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఆ రంగంలో రాణించే వ్యక్తులకు మాత్రం వ్యక్తిగతంగా తగిన గుర్తింపు లభించడం లేదు. గత యేడాది టెలివిజయన్ ఇండస్ట్రీ రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించింది. ఓటీటీ ఇండస్టీ మరో రూ.25 వేల కోట్లు అర్జించింది. ఈ రెండు ఇండస్ట్రీల ద్వారా రూ.55 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఆ రంగాల్లో వ్యక్తిగతంగా ఎవరికీ పెద్దగా గుర్తింపు రాలేదు అని ఆమె గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు