పచ్చసొనను వారానికి రెండుసార్లు తీసుకుంటే?

శుక్రవారం, 19 జనవరి 2018 (11:44 IST)
శరీరాకృతి, చర్మ ఛాయను మెరుగుపరుచుకోవాలంటే.. గుడ్డులోని పచ్చసొనను తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఇందులోని హెల్దీ లిపోప్రోటీన్ స్థాయిలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కోడిగుడ్డులోని పచ్చసొనను వారానికి రెండుసార్లు మాత్రమే వినియోగించుకోవాల్సి వుంటుంది. పచ్చి క్యారెట్లు, సహజ కెరోటిన్‌లను కలిగి వుంటాయి. 
 
క్యారెట్ కూడా విటమిన్ ఎను పుష్కలంగా కలిగి ఉండి, చర్మ రంగును మెరుగుపరుస్తాయి. పునరుత్పత్తి లక్షణాలు కలిగి ఉన్న ఆలివ్ ఆయిల్ చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతాయి. వైట్ చీస్ లేదా కుకుడ్ చీస్ లను వాడటం చర్మం ఆరోగ్యంగా వుంటుంది .
 
మామిడిపండ్లు కూడా పుష్కలంగా విటమిన్ ''ఎ'' కలిగి ఉండి, చర్మ రంగు మారటాన్ని నిలిపివేసి, చర్మ రూపును మెరుగుపరుస్తుంది. దీని వాడకం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు