తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయి. తమలపాకులను రోజుకొకటి నమిలితే.. గ్యాస్, అసిడిటీ దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. తద్వారా మధుమేహం అదుపులో వుంటుంది. తమలపాకులను కొద్దిగా తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గిపోతుంది. చర్మ సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసం తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి. మాటలో స్పష్టత వస్తుంది. కఫం తొలగిపోతుంది. జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.