చుండ్రును పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చుండ్రును పోగొట్టుకోవచ్చు. జుట్టును ఓ సారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకు మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
అల్లం ముక్కని పేస్ట్‌లా చేసి, దానికి కాస్త తేనె కలిపి మాడుకి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకి కారణమైన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. జుట్టుని మృదువుగా మారుస్తాయి.