గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయండి?

ఆదివారం, 3 మార్చి 2019 (14:54 IST)
సాధారణంగా అనేక మంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బ‌రం, ఛాతి నొప్పి, గ్యాస్ వ‌స్తుండ‌ట.. త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ఇలాంటి వారు మన వంటింట్లో అందుబాటులో ఉండేవాటితోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 
 
అయితే, ఈ గ్యాస్ సమస్యరావడానికి ప్రధాన కారణం.. వేళకు ఆహారం తీసుకోకపోవడం. మలబద్దకం, పేగుల్లో సమస్య, మధుమేహం, కడుపులో అల్సర్లు ఉత్పన్నంకావడం, మితిమీరిన ఉపవాసాలు ఉండటం, అతిగా మద్యం సేవించడం, ధూమపానం వల్ల ఈ తరహా సమస్యల బారిపడుతుంటారు. ఈ సమస్య ఉండేవారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అవేంటో పరిశీలిద్ధాం. 
 
* ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క, తేనేలను ఒక టీ స్పూన్ మోతాదులో కలుపుకుని తాగితే ఈ సమస్య నుంచి విముక్తిపొందవచ్చు. 
 
* పుదీనా ఆకులను వేడినీటిలో మరగించి, ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తాగినట్టయితే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. 
 
* భోజనం చేసిన తర్వాత 2 టీ స్పూన్ల వాములో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్టయితే గ్యాస్ సమస్యకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. 
 
* జీలకర్ర లేదా వామును వేడి నీటిలో మరగించి అనంతరం వడకట్టి ఆ నీటిని తాగినట్టయితే గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు