మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుందని.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును చుండ్రు నుంచి కాపాడుతాయి. మందార పువ్వుల్లో విటమిన్ ఎ, సి, అమినో యాసిడ్లు పుష్కలంగా వున్నాయి. మందార ఆకులు.. జుట్టుకు సౌందర్యాన్నిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది.