షాంపూను ఎలా వాడాలి..?

గురువారం, 7 మార్చి 2019 (11:18 IST)
ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నాం కాదా.. వాటిని వాడడంలో ఇంకా తప్పులు చేస్తామా అనిపించవచ్చు. కానీ, నిజాలు తెలిసే వరకు కొన్ని తప్పులు అలానే కొనసాగుతూ ఉంటాయి. అందువలన ఇంకా దొర్లుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం మేలు. నేటి తరుణంలో ఎన్నో రకాల షాంపూలు దొరుకుతున్నాయి. కానీ, వాటిల్లో ఏవి తలకు బాగా సరిపోతాయో తెలియక ఆలోచిస్తుంటారు. ప్రత్యేకించి డ్రై, ఆయిలీ, బ్రిటిల్ వీటిల్లో మీ జుట్టు ఏ రకానికి సంబంధించిందో మీరు తెలుసుకోవడం ముఖ్యం.
 
షాంపూ కమ్ కండీషనర్‌లను మీరు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే.. షాంపూ, కండీషనర్ ఒకే దాంట్లో ఉండడం వలన ఏ ప్రయోజనం ఉండదు. వాటిని మానేస్తే.. తల ఆరోగ్యానికే కాకుండా అనసరమైన ఖర్చు కూడా తగ్గుతుంది. షాంపూ వాడడానికి ముందు జుట్టు ఆరి ఉండాలి. లేదంటే అందులోని అంశాలు మీ జుట్టుమీద ప్రభావితం చేస్తాయి. ఇందుకోసం షవర్ కింద 2-3 నిమిషాలు ఉండాలి.
 
వెంట్రుల చివర్లే కాకుండా వాటి కుదుర్ల మీద కూడా పనిచేయడం వాటి ఉద్దేశం. అందువలన షవర్ కింద ఉన్నప్పుడు జుట్టు చివర్లతో పాటు వాటి కుదుర్ల వరకు శుభ్రమయ్యేలా చేసుకోవాలి. అదేవిధంగా షాంపూను రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే షాంపూను వాడాలి. ఒకవేళ జుత్తు జిగడగా ఉందనిపిస్తే స్వల్పంగా డ్రై షాంపూను వాడొచ్చు. ఇలా చేయడం వలన జుట్టు ఆకర్షణీయంగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు