హెయిర్ డ్రయర్స్ అతిగా వాడటం, కొన్ని మందులు వాడటం, ఆపరేషన్ తర్వాత, హిమోగ్లోబిన్ తక్కువైతే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. బరువు తగ్గడంతో పాటు పాటించే ఆహార నియమాల వల్ల కూడా హెయిర్ ఫాల్ తప్పదు. ఒత్తిడికి గురైనా జుట్టు రాలుతుంది.
అందుకే ప్రతిరోజూ ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని తీసుకోమంటున్నారు. అలాగే సమతులాహారం తీసుకోవాలి. చేపలు, దాల్, మొలకలు, పాలు, బాదం, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ బాగా తినాలి. వ్యాయామాలు, యోగ, ఏరోబిక్స్ వంటివి చేయడం వల్ల రక్తంలో చేరిన ఆక్సిజన్ శరీరానికంతా అంది ఆరోగ్యంగా ఉంటారు. మంచి నిద్ర కూడా శిరోజాల పరిరక్షణకు అవసరమేనని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు.