నిమ్మరసం, మెంతి ఆకుల పేస్టుతో మొటిమలు తొలగిపోతాయా? ఎలా?

మంగళవారం, 12 జులై 2016 (15:26 IST)
నిమ్మరసంతో మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తాజా నిమ్మరసాన్ని.. ముఖంపై మొటిమలపై పూయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మకాయ తొక్కను నేరుగా చర్మానికి పూయకుండా.. ఒక చిన్న గిన్నెలో నిమ్మకాయ రసాన్ని తీసుకుని, చిన్న పత్తి ముక్కను నిమ్మరసంలో తడిపి మచ్చలపై పూయండి.
 
అలాగే మొటిమలకు చెక్ పెట్టాలంటే.. మెంతి ఆకుల నుండి తయారు చేసిన ఫేస్ మాస్క్‌ను వాడండి. ఇందులో తొలుత, మెంతి ఆకులను దంచి వాటిని నీటిలో కలిపి వేడి చేయండి. తరువాత మిశ్రమాన్ని చల్లబరచిన తరువాత, ఒక పేస్ట్‌లా తయారవుతుంది. ఈ పేస్ట్‌ను మొటిమల వలన ఏర్పడిన మచ్చలపై రాయండి. ఇలా వాడటం వలన మచ్చలు త్వరగా తగ్గి మంచి ఫలితాన్ని పొందుతారు.

వెబ్దునియా పై చదవండి