వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

సోమవారం, 20 మార్చి 2017 (16:59 IST)
వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మూడు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్స్ శెనగపిండిని పేస్టులా కలుపుకుని... ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
అలాగే ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
 
అలాగే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, అర టేబుల్ స్పూన్ గంధపు పొడి, చిటికెడు పసుపును తీసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిలీ అండ్ పొడి చర్మాల వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి