గోళ్ళను అందంగా వుంచుకోవాలంటే? ఇలా చేయండి..

సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:58 IST)
గోళ్లు ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే మీరు వాటిని కత్తిరించేటపుడు చక్కని ఆకారంలో జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 
 
గోళ్లను కత్తిరించడానికి ముందుగా మీ చేతులలో గల రంగులను తీసివేయాలి. ఒక వేశ మీరు స్నానం చేసిన తరువాత గోళ్లను కత్తిరిస్తే చాలా తేలికగా కట్ అవుతాయి. అలాగే నెయిల్ కట్టర్ మన్నికైనదిగా ఎంచుకోవాలి. మీకు షేప్ కావాలంటే ముందుగా మెుదటి రెండూ అంచులను కత్తిరించాలి. ఆపై మొత్తం గోరును ఫైల్ చేసేటప్పుడు ఒక వైపుగా చేయాలి లేదంటే మీ గోళ్ల అంచులు చిట్లుతాయి. 
 
గోళ్లను చిగుళ్లకు దగ్గరగా కత్తిరించకూడదు. మీ గోళ్ల అంచులు నునుపుగా ఉండాలంటే అలా వచ్చేంత వరకు ఫైల్ చేయాలి. ఇలా చేశాక గోళ్లకు ఆలివ్ ఆయిల్ రాసి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన నెయిల్‌ పాలిష్ పెట్టేసుకుంటే గోళ్లు అందంగా మెరిసిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు