దంపతుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్య కారణంగా చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతానసాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో వీర్య కణాలు పెంపొందించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పధార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.