మొటిమలను దూరం చేసుకోవాలంటే? ఉల్లిపాయ బెస్ట్..

బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:10 IST)
ముఖంపై మొటిమలకు చెక్ పెట్టాలంటే.. నలక్కొట్టిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం నీటిలో కలిపి.. దానిని మొటిమలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఐరన్ చేస్తున్నప్పుడు కానీ స్టౌపై పెట్టిన గిన్నెల్ని దించుతున్నప్పుడో కొద్దిగా కాలితే ఆ ప్రాంతాల్లో ఉల్లిపాయన రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అలాగే తేనెటీగ కుట్టినచోట ఉల్లిపాయతో రుద్దితే బాధ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక తుప్పు పట్టిన చాక్‌లపై ఉల్లిపాయతో రుద్దితే మెరవడం ఖాయం. కొత్తగా పెయింట్ వేసిన గదిలో ఆ వాసన పోవడానికి ఉల్లి రూమ్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది. నీళ్లు ఉన్న ఒక పాత్రలో తాజా ఉల్లిపాయ ముక్కలను ఉంచి ఆ పాత్రను ఒక రోజు రాత్రంతా ఆ గదిలో ఉంచితే మంచి ఫలితం కనబడుతుంది.

వెబ్దునియా పై చదవండి