ఈ రోజుల్లో తక్కువ వయస్సులోనే చాలామంది వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. తీసుకునే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడటం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అయితే యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సీడెంట్స్ లక్షణాలు కలిగిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మంపై ముడతలు, చర్మం వదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
2. తరచుగా దానిమ్మ గింజలు మరియు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది చర్మ కణాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. దానిమ్మ చర్మాన్ని బిగుతుగా మార్చే యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది మీ చర్మానికి కావలసిన పోషణను అందించి అందం, మంచి గ్లోయింగ్ వచ్చేలా సహాయపడుతుంది.