నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము.
ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి.
ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి.
అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి.
తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి.
కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వీలైతే వారానికోసారి వైద్యుల సలహాతో ఉపవాసం పాటించవచ్చు.