పొడి చెత్త రీసైక్లింగ్ కోసం కృషి చేస్తోన్న విద్యార్థులు, పాఠశాలలను గుర్తించిన ఐటిసి వావ్

ఐవీఆర్

శుక్రవారం, 19 జనవరి 2024 (17:15 IST)
వ్యర్ధాల నిర్వహణ, పునర్వినియోగ పద్ధతులను ప్రోత్సహించే ప్రయత్నంలో, ఐటిసి లిమిటెడ్ ఈరోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో వెల్‌బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (WOW) ఇంటర్‌స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ అవార్డుల కార్యక్రమంను నిర్వహించింది. ఛాంపియన్‌షిప్ సమయంలో సమర్థవంతమైన రీతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా స్వచ్ఛ భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో విద్యార్థులు, పాఠశాలలు చేసిన విశేషమైన కృషి,  అందించిన సహకారాన్ని గుర్తించి, వేడుక జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించింది.
 
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీమతి ఎ. వాణీప్రసాద్ IAS, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్ IAS, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ WG ప్రసన్న కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, పాఠశాలలకు అవార్డులు, పతకాలు వారు అందజేశారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీ అంతటా జరిగిన ఐటిసి వావ్ ఇంటర్‌స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ (ISRC)లో 10,000 పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 లక్షల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ విస్తృతమైన కార్యక్రమం ఫలితంగా కాగితం వ్యర్థాలతో సహా 6000 మెట్రిక్ టన్నుల పొడి వ్యర్థాలు సేకరించబడ్డాయి. ఈ కార్యక్రమం యొక్క స్థాయి, ప్రభావం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై భారతదేశం యొక్క అతిపెద్ద అవగాహన కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది.
 
ఈ సందర్భంగా ఐటిసి లిమిటెడ్ పేపర్‌బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వాదిరాజ్ కులకర్ణి మాట్లాడుతూ, "స్వచ్ఛ్ భారత్, చెత్త రహిత భారతదేశం కోసం నిర్వహించిన పోటీలో పాల్గొన్న వారందరికీ, పోటీ విజేతలకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలే మన దేశానికి భావి పౌరులు, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ వంటి జాతీయ, స్థానిక స్థాయిలలో పరిశుభ్రత లక్ష్యాలను సాధించడానికి వారి అవగాహన, ప్రేరణ చాలా కీలకం అని గుర్తించాము. ఈ విద్యా సంవత్సరంలో, మేము హైదరాబాద్‌లోని 418 పాఠశాలల్లో ఐటిసి WOW ఇంటర్‌స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము, 1.5 లక్షల మంది విద్యార్థులలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించాము" అని అన్నారు.
 
ఐటిసి WOW ప్రోగ్రామ్, 2007లో ప్రారంభించబడింది, ఇది ఒక మార్గదర్శక రీసైక్లింగ్ కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం ప్రజలకు మూలాల వద్దనే వ్యర్ధాల  వేర్పాటు అలవాట్లను పెంపొందించడం, వనరులను పునరుద్ధరించడం, రీసైకిల్ చేయడం, సహజ వనరులను సంరక్షించడం, వ్యర్థాలను నిర్వహించేవారికి స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, స్వచ్ఛ భారత్‌కు సహకరించడం. ఈ పోటీ ప్రత్యేకంగా పాఠశాల పిల్లలలో వ్యర్థాల విభజనపై అవగాహన పెంచడం, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పొరుగు ప్రాంతాలలో అవగాహన కల్పించడానికి వారిని మార్పు ఏజెంట్లుగా మార్చడం లక్ష్యంగా చేసుకుంది. 
 
ఐటిసి WOW  ప్రాజెక్ట్ గణనీయమైన ప్రభావాన్ని చూపింది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, చెన్నై,  ఢిల్లీ, తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లోని 55 లక్షల కుటుంబాలకు చేరువైంది. ఏటా 64,000 మెట్రిక్ టన్నుల పొడి వ్యర్థాలను సేకరించడం, 17,750 మందికి పైగా వ్యర్థ పదార్థాల నిర్వహణదారులకు స్థిరమైన జీవనోపాధిని అందించడం, 57 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు అవగాహనను అందించడం, 2.2 కోట్ల మంది ప్రజలకు  వ్యర్థాల నిర్వహణలో స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి ప్రేరేపించడం వంటివి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన విజయాలు.
 
పట్టణ స్థానిక సంస్థలతో (మునిసిపల్ కార్పొరేషన్లు) సహకార, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థ ద్వారా వ్యర్థాలను సేకరించేవారికి స్థిరమైన జీవనోపాధిని అందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ఈ కార్యక్రమం అనేక మంది సామాజిక వ్యాపారవేత్తలకు సాధికారతను అందించడమే కాకుండా సేకరించిన పొడి వ్యర్థాల నుండి గరిష్ట విలువను సంగ్రహించడంపై దృష్టి సారించింది. ఈ ఆర్థిక అంశాలకు అతీతంగా, ఐటిసి WOW, కాలుష్య మార్గాలను తగ్గించే దిశగా కమ్యూనిటీ ఉద్యమాన్ని పెంపొందించడంలో కీలక పాత్రను పోషించే , ప్రవర్తన మార్పును ప్రోత్సహించడంకు అమిత ప్రాధాన్యతనిస్తుంది. ఈ కార్యక్రమం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వైపు పని చేయాలనే విస్తృత లక్ష్యంతో సమలేఖనం చేయబడింది.
 
గ్లోబల్ సస్టైనబిలిటీకి ఉదాహరణగా ఐటిసి నిలుస్తుంది, ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌ను వరుసగా 16 సంవత్సరాలు సానుకూలంగా, వరుసగా రెండు సంవత్సరాలు ప్లాస్టిక్ న్యూట్రాలిటీని నిర్వహిస్తున్న ప్రపంచంలోని ఏకైక కంపెనీగా గుర్తింపు పొందింది. దాని సస్టైనబిలిటీ 2.0 ఎజెండాకు అనుగుణంగా, ఐటిసి తన ప్యాకేజింగ్‌లో 100% 2028 నాటికి పునర్వినియోగపరచదగిన, రీసైకిలబల్ లేదా కంపోస్టబుల్/బయో-డిగ్రేడబుల్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్టిక్ న్యూట్రాలిటీ వైపు తమ ప్రయాణంలో, ఐటిసి  2022-23లో తమ విజయాలను కొనసాగించింది. ఇది భారతదేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 60,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించింది, ఇది వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు దోహదపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు