చెర్రీ, బ్రొకొలితో సన్నగా, నాజూగ్గా మారండి..

గురువారం, 5 సెప్టెంబరు 2019 (13:26 IST)
సన్నగా, నాజుగ్గా అందంగా కనిపించాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అందమైన శరీరం పొందడం అంత కష్టమైన పనేమి కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఎవరైనా తమ శరీరాకృతిని చక్కగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
 
* సరైన వేళకి సరైన ఆహారం తీసుకోవాలి. సమతులాహారం శరీరానికి అవసరం. దీనివల్ల మీరు ఎంతో ఎనర్జిటిక్‌గా తయారవుతారు. 
 
* వ్యాయామాలు చేసే ముందర ఓట్స్‌, గుడ్లు లేదా గుప్పెడు బాదంపప్పులు లేదా ప్రొటీన్‌షేక్‌ తీసుకోవాలి.
 
* జిమ్‌లో వెయిట్స్‌ ఎత్తడం చాలామంది అమ్మాయిలు చేయరు. అలా చేస్తే తమ శరీరానికి ఎక్కడ హాని కలుగుతుందోనని భయపడుతుంటారు. కానీ వెయిట్స్‌ ఎత్తడం కూడా శరీర ఫిట్‌నె‌స్‌కు ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్కవుట్లుని మానివేయకూడదు. పుషప్స్‌, సిటప్స్‌, వాకింగ్‌ స్క్వాట్స్‌ వంటివి చేస్తే శరీరానికి ఎంతో మంచిది.
 
* వర్కవుట్లు చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత మూడుసార్లు తప్పకుండా నీళ్లు తాగాలి.
 
* ఒత్తిడి నుంచి బయటపడడానికి పండ్లు, కూరగాయలు, చెర్రీలు, బ్రొకొలి వంటివి తరచూ తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు