మెుటిమలతో బాధపడుతున్నారా? టమోటా గుజ్జును రాసుకుంటే?

మంగళవారం, 17 జులై 2018 (12:36 IST)
మెుటిమలు తొలగిపోవడానికి కొన్ని బ్యూటీ చిట్కాలు. నిమ్మరసంలో బాదం నూనెను, కొద్దిగా ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కలబంద గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
టమోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ టమోటాను గుజ్జులా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఈ గుజ్జులోనే కొద్దిగా పెరుగును కలుపుకుని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన జిడ్డుగా ఉన్న ముఖం కాస్త నునుపుగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు