పెదవుల సంరక్షమ అనగానే కేవలం లిప్‌బామ్ రాసుకోవడంతోనే అయిపోతుందనుకుంటారు. కానీ వాటిపై మృతుకణాలు పేరుకుంటాయి. దాంతో పెదవులు పొడిబారినట్లుగా, నల్లగా మారుతాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తేనెలో కాస్త చక్కెరను కలుపుకుని ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి వేళ్లతో కాసేపు మృదువుగా మర్దనా చేయాలి.