వేసవిలో చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే..?

శనివారం, 15 ఏప్రియల్ 2017 (16:01 IST)
ఫ్రిజ్‌లోని చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవడం ద్వారా వేసవిలో ఒత్తిడి, వేడిమికి గురైన చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మసాజ్ చేసి సహజంగా ఎండనివ్వాలి. రాత్రి నిద్రించడానికి ముందు ఐస్ వాటర్‌ను రెగ్యులర్‌గా ముఖానికి ఉపయోగించడం వల్ల, నిద్రలేచే సమయానికి కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
 
అలాగే కంటి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కీరదోసకాయ ముక్కలను కళ్లకు అప్లై చేయాలి. ఇవి కంటి ఉబ్బును తగ్గిస్తుంది. రెండు పల్చని కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద ఉంచాలి. కీరదోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల , కళ్ళమీద చర్మంను పునరుత్తేజపరుస్తుంది. కళ్లు చూడటానికి తాజాగా కనిపిస్తాయి. ఇంకా కళ్ల అలసటను.. నిర్జీవంగా మారిన కళ్ళకు.. పొటాటో ముక్కలు కూడా కీరదోసలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి