ఆ నాలుగు నూనెలు చర్మానికి రాసుకుంటే...

గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:33 IST)
కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనెలు శీతాకాలంలో చర్మాన్ని రక్షించగలవు. ఈ నూనెలను రాయడం  ద్వారా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి నూనెలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనె శరీరానికి రాసుకుంటే ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఎలాంటిదైనా కొబ్బరినూనె వాడొచ్చు.
 
ఆలివ్ ఆయిల్ చర్మ సౌందర్యానికి చక్కని సాధనం. దీనిలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దనతో చర్మం ఎంతో సౌందర్యంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. 
 
ఆల్మండ్ ఆయిల్ చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు ఆల్మండ్ నిరోధిస్తుంది.
 
నువ్వుల నూనెలోని విటమిన్ బి,ఇ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియమ్‌ల ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు