మధుమేహానికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం మంచి ఔషధంలా పనిచేస్తుంది. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగినే ఉపశమనం లభిస్తుంది. వంటగదిలో తప్పకుండా అల్లం వుండి తీరాలి. అల్లం మంచి యాంటి ఆక్సీడెంట్. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో కీలకమైంది.
దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. ఇంకా సహజంగా వచ్చే దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం మెరుగ్గా పనిచేస్తుంది. విపరీతమైన దగ్గు ఇబ్బంది పెడుతుంటే వెంటనే అల్లం, ఉప్పు కలిపి తీసుకోంటే సరి.. ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది.
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో, శ్వాసనాళాల్లో ఉన్న టాక్సిన్స్‌ని వెంటనే తొలగిస్తాయి. శ్వాస సంపూర్తిగా అందేందుకు సహకరిస్తుంది. అందుకే అల్లంను టీల్లో ఉపయోగించాలి. కూరల్లోనూ దీన్ని ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.