నిత్య సత్యము అయిన దీపమా...!!

బుధవారం, 30 మే 2012 (17:40 IST)
WD
నిత్యము
సత్యము
అయిన దీపమా
నువ్వు వెలుగు
నా అపజయాల్ని నీ కాంతి జలాలతో
కడిగివేయి
నా శరీరమ్మీద చీకటి మరకల్ని
తుడిచేయి నీ కిరణ హస్తాలతో
నువ్వు వెలుగు
సత్యాన్ని ఎదుర్కొనే జ్ఞానకాంతినివ్వు
వెలుగూచీకటి
కాని
నిత్యసత్యమౌ
అనంత సత్యజ్యోతి
నువ్వు వెలుగు
నాలోని కాపట్యాన్ని ధ్వంసించు
నా మొహమాటాల్ని
ఆవేశాల్ని, లాలననూ
తొలగించు
ఈ సంజెవేళ
చేతులెత్తి నిన్ను ప్రార్థిస్తున్నా
నాకు చూపునివ్వు

వెబ్దునియా పై చదవండి