సినీనటుడు, అగ్రహీరో విశాల్‌తో ప్రేమలో వున్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న అభినయ దక్షిణాది సినిమాల్లో మంచి పేరు కొట్టేసిన నటీమణుల్లో ఒకరు. ఆమె శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. కోలీవుడ్ నటుడు విశాల్‌తో ఆమె ప్రేమలో వున్నట్లు వార్తలొచ్చాయి.
అయితే, అభినయ తనకు ఎవరితో నిశ్చితార్థం అయిందో వివరాలను వెల్లడించలేదు. అయితే, ఆమె తన చేతి మీద నిశ్చితార్థపు ఉంగరం ఉన్నట్లు చూపించే ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చిత్రంలో ఆమె కాబోయే చేతిని కూడా మనం చూడవచ్చు. డఫ్ అండ్ డమ్ అయిన అభినయ నటనలో రాణించింది.