ప్రయాణికులపై ఛార్జీల భారం మోపకుండా, రైల్వే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగంలో ఉందని, అయినా సవాళ్ళ మధ్య మన ప్రయాణం కొనసాగతున్నట్టు చెప్పారు. ఇద దేశ ప్రజల బడ్జెట్ అని చెప్పారు. దేశాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికే రైల్వేలు బాసటగా నిలుస్తాయన్నారు. దేశానికి అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు.