Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

దేవీ

మంగళవారం, 1 జులై 2025 (11:12 IST)
Sirish - Dil Raju
రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి అట్టర్ ప్లాప్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. గేమ్ ఛేంజర్ ప్లాప్ తో మా బతుకు అయిపోయిందని అందరూ అనుకున్నారు. దిల్ రాజు, శిరీష్ అయిపోయారంటూ ఇండస్ట్రీలో టాక్ నెలకొంది. కానీ మాము మేమే నిలబడ్డాం. నాలుగు రోజుల తేడాతో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మాకు బలం వచ్చింది అని నిర్మాత శిరీష్ మనసులో మాటను వెల్లడించారు.
 
నితిన్ తో తమ్ముడు సినిమా నిర్మించారు శిరీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ప్లాప్ అయితే ఎవరూ వచ్చి త్యాగాలు చేయలేదు. కనీసం ఎలా వున్నారని దర్శకుడు వచ్చి అడగలేదు. ఆ సినిమాను ఇష్టపడి తీసుకుని రిలీజ్ చేశాం. మేం ఇలా అయిపోయామని ఇండస్ట్రీలో ఎవరినీ అడిగే అలవాటు మాకు లేదని శిరీష్ అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, మా బేనర్ లో చాలా ప్లాప్ లు హిట్ లు తీశాం. నాకు చాలా ప్లాప్స్ వచ్చాయి. 21 సంవత్సరాలు ఇండస్ట్రీలో వున్నాం. ఎత్తుపల్లాలు మామూలే. అందుకే తమ్ముడు సినిమా చూశాక చెబుతున్నా. సూపర్ హిట్. ఇక అంతకుముందు రామ్ చరణ్ కు హిట్ఇవ్వలేకపోయాం. గేమ్ ఛేంజర్ తో ప్లాప్ సినిమా తీశాం. అందుకే హిట్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాం. త్వరలో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాం అని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు