బిజినెస్ మేగ్‌జైన్‌ను కొనుగోలు చేయనున్న బ్లూమ్‌బెర్గ్
ఆర్థిక సమాచారాన్ని అందించే ప్రముఖ కంపెనీ బ్లూమ్‌బెర్గ్ త్వరలో బిజినెస్ వీక్ మేగ్‌జైన్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి బ్లూమ్‌బెర్గ్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఓ టీవీ న్యూస్ ఛానెల్ వివరాల ప్రకారం.. ఈ ఒప్పందం.. 5 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తతం అమెరికా వ్యాపార ప్రపంచంలో.. ఈ బిజినెస్ మేగ్‌జైన్‌కు సుమారు 9,21,000 వరకు సర్క్యులేషన్ జరుగుతోంది. ప్రచురణ ప్రారంభమైన మూడు నెలల తర్వాత ఇటీవల కాలంలో ఈ మేగ్‌జైన్ విక్రయాలు బాగా తగ్గాయి. బ్లామ్‌బెర్గ్ సంస్థకు చెందిన ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ బిజినెస్ మేగ్‌జైన్‌ను తమ కంపెనీ హస్తగతం కానున్నట్లు తెలిపారు.
బ్లూమ్‌బెర్గ్ అధ్యక్షుడు డేనియెల్ డాక్టరాఫ్ మాట్లాడుతూ, బీజినెస్ వీక్ ద్వారా తమ వినియోగదారులకు కార్పొరేట్ సంబంధిత, ప్రభుత్వం సంబంధించిన అన్ని కోణాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. అలాగే ఇందులో వచ్చే వార్తలు మార్కెట్లు మరియు సీఈఓ, సీఎఫ్ఓల ఒప్పందాలు, లాయర్లు, బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారుల వ్యాపార సంబంధిత కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయన్నారు.