భారత్‌లో బ్రిటన్ పెట్టుబడులు పెట్టాలని కోరిన ఆనంద్ శర్మ

FILE
మౌళిక సదుపాయాల రూపకల్పన వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్‌ను భారత్ కోరుతుంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మొరుగు పరిచేందుకు ఇటువంటి పెట్టుబడులు దోహదం చేస్తాయని వాణిజ్య పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు.

ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టెబుల్ సమావేశంలో పాలు పంచుకోవడానికి ఆయన లండన్‌కు వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ పెడుతున్న పెట్టుబడుల్లో భారత్‌కు వస్తున్నది ఒక శాతం మాత్రమే అన్నారు. ఈ సమావేశానికి పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవలి సంస్కరణలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో భారత్‌ మరింత ముందుకు దూసుకుపోతుందని వివరిస్తూ భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బ్రిటన్ పారిశ్రామికవేత్తలను శర్మ కోరారు.

వెబ్దునియా పై చదవండి