వామ్మో ఉల్లి... రూ. 100 తాకిన కిలో ఉల్లి ధర

శుక్రవారం, 25 అక్టోబరు 2013 (15:51 IST)
FILE
గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి దిగుమతులు లేకపోవడం, చాలామటుకు ఉల్లిపంట నష్టపోవడంతో దేశంలో ఇలాంటి పరిస్థితి ఎర్పడింది. వచ్చే రెండు వారాల్లో ఉల్లిధరలు తగ్గే సూచనలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పట్లో ఉల్లి ధరలు తగ్గేలా లేవు.

ప్రముఖ నగరాలైన ముంబయి, భోపాల్, లక్నో, చెన్నై, గౌహతి, శ్రీనగర్, ఇంపాల్ మరియు కోల్‌కతాలో కిలో ఉల్లి ధర 60నుంచి 80 రూపాయలు దాకా ఉంది. ప్రస్తుతం ఉల్లి కిలో ధర సరాసరిగా రూ. 57 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది. అత్యధికంగా పాట్నాలో రూ. 100 పలుకుతోంది. అంతేకాకుండా ఢిల్లీ, జైపూర్, చండీఘర్, బెంగళూరులో రూ. 80నుంచి 90 వరకూ పలుకుతోంది.

వెబ్దునియా పై చదవండి