ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ఠాగూర్

ఆదివారం, 24 ఆగస్టు 2025 (15:13 IST)
వయసులో 50 యేళ్లుదాటినప్పటికీ ఆరోగ్యంగా, స్లిమ్‌గా కనిపించడం వెనుక ఉన్న రహస్యాన్ని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తాజాగా వెల్లడించారు. ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తారని, కానీ, ఇలా చేయడం చాలా తప్పు అని ఆమె వెల్లడించారు. ఉదయం నిద్రలేవగానే ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటి తాగుతానని అలా ప్రతి రోజూ తన దినచర్య మొదలవుతుందని చెప్పారు. 
 
ఆ తర్వాత కాసేపటికి నాలుగు చుక్కల నోనీ జ్యూస్ తీసుకుంటానని చెప్పారు. ఆపై టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ తప్పనిసరి అని వివరించారు. బ్రేక్ ఫాస్ట్‌లో సీజనల్ ఫ్రూట్స్, బాదం పాలు, మ్యూజ్లీ, ఉడికించిన గుడ్లు, మధ్యాహ్న భోజనంలో నెయ్యి తప్పనిసరి అని శిల్పాశెట్టి వివరించారు. అయితే, తాను పాటించే ఆహార అలవాట్లు అందరికీ సరిపడకపోవచ్చని హెచ్చరిస్తూ, వైద్యుల సలహాతోనే డైట్, ఫిట్నెస్‌లు వంటివి చేయాలని ఆమె సలహా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు