2009లో 54,960 కోట్ల విదేశీమారకద్రవ్యం!

ఆదివారం, 10 జనవరి 2010 (15:35 IST)
గత యేడాది దేశ పర్యాటక శాఖ నుంచి భారత్‌కు 54,960 కోట్ల రూపాయల విదేశీమారకద్రవ్యం రూపంలో ఆదాయం సమకూరింది. గత 2008 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 8.3 శాతం అధికం.

అలాగే డిసెంబరు నెలలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ముంబై దాడులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా నవంబరు నెలలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే.

అయితే, డిసెంబరులో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. 2009 డిసెంబరు నెలలో భారత్‌కు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 6.46 లక్షలని తెలిపారు. 2008 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 21 శాతం అధికం.

వీరిమూలంగా దేశానికి వచ్చిన విదేశీమారకద్రవ్యం రూ.54960కోట్లు కాగా, 2008 సంవత్సరంలో 50730 కోట్ల రూపాయల విదేశీమారకద్రవ్యాన్ని పర్యాటకశాఖ అర్జించింది. ఒక్క డిసెంబరు నెలలోనే 151 కోట్ల డాలర్ల మారకద్రవ్యాన్ని అర్జించినట్టు ఆశాఖ అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి