35 శాతం అమ్మకాలు పెరిగిన టాటా స్టీల్

మంగళవారం, 8 డిశెంబరు 2009 (11:02 IST)
దేశీయ స్టీల్ ఉత్పత్తి రంగంలో అగ్రగామిగానున్న టాటా స్టీల్ సంస్థ గడచిన నవంబర్ నెలలో జరిగిన అమ్మకాలలో 35 శాతం వృద్ధి జరిగింది.

ప్రస్తుత ఏడాది నవంబర్ నెలలో తమ సంస్థకు చెందిన అమ్మకాలలో 35 శాతం వృద్ధి జరిగి 4.98 లక్షల టన్నుల స్టీల్ అమ్ముడుపోయిందని టాటా స్టీల్ కంపెనీ తెలిపింది.

అదే నిరుడు నవంబర్ నెలలో జరిగిన అమ్మకాలు 3.70 లక్షల టన్నుల స్టీల్ అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది.

నవంబర్ నెలలో జరిగిన తమ సంస్థకు చెందిన స్టీల్ అమ్మకాలలో ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల్లో 56 శాతం, లాంగ్ స్టీల్ ఉత్పత్తుల్లో 13 శాతం వృద్ధి జరిగిందని కంపెనీ వివరించింది.

ఇదిలావుండగా ఆటోమొబైల్ రంగం తదితర కంపెనీల ఉత్పత్తులకు ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులను వాడుతుంటారు. అదే లాంగ్ స్టీల్ ఉత్పత్తులను వివిధ కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి.

వెబ్దునియా పై చదవండి