కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు... డీఏను 17 నుంచి 21 శాతానికి అంటే 4 శాతం పెంచేందుకు నిర్ణయించింది. జనవరి నుంచి ఇది వర్తించే అవకాశం ఉంది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితిని వివరించి, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఇవ్వాలని కోరారు.