ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని టీకాలు తయారైనా అందరి దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్ టీకా పైనే ఉన్నది. ఆస్ట్రాజెనికా సంస్థతో కలిసి తయారుచేసిన టీకా మంచి ఫలితాన్నిస్తుందని పలువురి నమ్మకం. ఈ టీకాను ఉపయోగించడంతో యువతతో పాటు వృద్దుల్లోనూ మెరుగైన మార్పు కనిపిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. యాంటీబాడీతో పాటు అవి క్రియేట్ చేసే టీసెల్స్ నెంబర్ కూడా భారీగా ఉందని చెప్పారు.దీంతో ఒక్కసారిగా ఆశ మొదలైంది.
కరోనా కష్టాలకు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడింది. భారత్ దేశంలో సీరమ్ సంస్థ కోవీ షీల్డ్ పేరుతో ఆక్స్‌ఫర్డ్ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇది డిసెంబరు నాటికి రెడీ అవుతుందని ఆ సంస్థ చీఫ్ ఆదార్ పూనావాలా తెలిపారు. పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లతో వచ్చే ఏడాది ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. బ్రిటన్లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్ పరీక్షలు పూర్తయి వ్యాక్సిన్ సామర్థ్యం భద్రత మెరుగ్గా ఉందని తెలిస్తే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని పూనావాలా తెలిపారు.