కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంట... 30 శాతం వేతన పెంపు.. ఏడో వేతన సంఘం సిఫార్సు!

గురువారం, 16 జూన్ 2016 (16:11 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పంట పండనుంది. వేతనాల్లో 30 శాతం పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేయనుంది. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సారథ్యంలోని కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఒక నివేదికను తయారు చేసింది. వాస్తవానికి ఈ కమిటీ 23.55 శాతం మేరకు పెంచవచ్చని సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే, ఈ కమిటీ సమర్పించే నివేదికలో మాత్రం ఈ పెంపుదల 30 శాతం మేరకు పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు శుక్రవారం సమర్పించనుంది.
 
వేతన సంఘం సిఫార్సుల మేరకు 30 శాతం పెరుగుదల ఉన్నట్టయితే, ప్రస్తుతమున్న కనిష్ట మూల వేతనం రూ.18 వేల నుంచి రూ.23,500లకు పెరగనుంది. అలాగే, గరిష్ట మూల వేతనం రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షలకు చేరనుంది. దీనివల్ల 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 55 లక్షల పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. ఈ కొత్త వేతనం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి