మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా మాస్ జాతర. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాకుశ్రీకారం చుట్టారు. తన 76వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివార్లో ప్రారంభమైంది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ తో ఫొటో విడుదలచేసింది చిత్ర టీమ్.