ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. 'భూ అంటూ భూతం..' పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. 'భూ అంటూ భూతం..' పాట ఎలా ఉందో చూస్తే - 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట.
నటీనటులు - నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు