కోటి మందికి ఒకటే 'ఆధారం'

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:40 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అయితే ఆధార్ కార్డ్‌లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆధార్ కేంద్రంలో సరిచేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగర వాసులకు ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉంది. ఇదివరకు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుండేది. 
 
అయితే ఆన్‌లైన్ సమస్యలతో మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో ఆధార్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. దీనితో హైదరాబాద్‌లో ఆధార్ సేవల కసం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మిగిలింది.

ఆలస్యంగా వస్తే జనాభా ఎక్కువవుతుండటంతో ఉదయం 5 గంటలకల్లా దాదాపు 1000 మంది చేరుకుంటున్నారు. అయితే వారిలో సగం మందికి కూడా టోకెన్లు లభించడం లేదు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు