రైతులకు తీపికబురు..రూ.లక్ష క్యాష్‌ప్రైజ్.. రిజిస్ట్రేషన్ ఇలా..?

శనివారం, 2 జనవరి 2021 (12:36 IST)
కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీని పేరు అగ్రి హ్యాకథన్ 2020. ఐఏఆర్‌ఐ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రెండు నెలలపాటు జరగునుంది.

ఇండియన్ అగ్రికల్చర్ విభాగంలో జరుగుతున్న అతిపెద్ద వర్చువల్ కార్యక్రమం ఇదే. ఇందులో రైతులు సహా ఎవరైనా పాల్గొనవచ్చు. యువత, స్టార్టప్స్, స్మార్ట్ ఇన్నోవేటర్స్ ఇలా ఎవరైనా ఈ హ్యాకథన్‌లో పలుపంచుకోవచ్చు.
 
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు వీరు వారి నూతన ప్రొడక్టులతో పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఇంకా రైతులకు మెరుగైన సేవలు అందించే ప్రొడక్టులను తయారు చేయవచ్చు. ఇంకా అన్నదాతల పనులను సులభతరం చేసే ఆవిష్కరణలు తీసుకురావొచ్చు. 
 
రిజిస్టర్ చేసుకోవాలంటే.. MyGov.in వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. జనవరి 20 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇందులో 3 రౌండ్ల ఎలిమినేషన్ ఉంటుంది. చివరిలో 24 మంది విజేతలకు రూ.లక్ష క్యాష్‌ప్రైజ్ అందిస్తారు. ఇంకా ప్రొడక్టుల తయారీకి ఆర్థిక మద్దతు అందిస్తారు. ఫామ్ మెకనైజేషన్, సప్లై చెయిన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, వేస్ట్ టు వెల్త్, గ్రీన్ ఎనర్జీ, అగ్రికల్చర్ ఇలా వివిధ విభాగాలకు సంబంధించి కొత్త ఐడియాలు ఇవ్వొచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు